సంబంధిత వార్తలు
- శనివారం ఆంజనేయ పూజ.. అరటిపండ్లు, సింధూరం, నువ్వుల నూనె.. ఈ మంత్రం..
- sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- శ్రావణ మంగళవారం- శివపార్వతులకు పంచామృతం అభిషేకం.. ఏంటి ఫలితం?
- Sravana Saturday: శ్రావణ శనివారం- ఈ పనులు చేస్తే శని గ్రహ దోషాలు మటాష్
- Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?
నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?
నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని యాంటీఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి, వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది.
నువ్వులు, నువ్వుల నూనె వాడుతుంటే మధుమేహం, బీపీలను నివారిస్తుంది.
నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడి ఆస్టియోపోరోసిస్‌ని తగ్గిస్తాయి.
నువ్వులను తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
నువ్వుల నూనెను పుక్కిలించడం వల్ల ఆస్త్మా రోగుల్లో శ్లేష్మాన్ని హరిస్తుంది.
పాలిచ్చే తల్లులకు రోజూ కొంచెం నువ్వులు పెడితే పాలు పడతాయి, నువ్వుల ఉండ తినడం వలన కాల్షియం అందుతుంది.
నువ్వులనూనెను శరీరానికి మర్దనా చేసుకోవడం వలన కూడా కీళ్లనొప్పులు తగ్గుతాయి.
