మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
మెంతి ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి.
మెంతి ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడం తగ్గుతుంది.
మెంతి ఆకుల పేస్టును ముఖం మీద వైట్‌హెడ్స్ పైన అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచి తెల్లారాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే కొన్ని రోజులకు వైట్‌హెడ్స్ తగ్గుతాయి.
తర్వాతి కథనం
