కుండనీరు తాగితే ఏంటి లాభం.. తెలుసుకుందామా?
కుండ, మట్టి పాత్రలో నీరు నిల్వచేసి తాగడం ఆరోగ్యదాయకం. ఎందుకంటే ఇది సహజమైన చల్లదనాన్ని ఇస్తుంది. అంతేగాకుండా మట్టికుండలోని సూక్ష్మ రంధ్రాల ద్వారా నీరు ఆవిరయ్యే ప్రక్రియ నీటిని చల్లగా వుంచడంలో సహాయపడుతుంది. కుండలోని నీరు ఫ్రిజ్‌లోని ఐస్ -కోల్డ్ లాగా జీర్ణ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందిని ఇవ్వదు.
ముఖ్యంగా వేసవిలో గొంతుకు, జీర్ణక్రియకు సౌకర్యంగా వుంటుంది. ఇంకా మట్టి సహజంగానే ఆల్కలైన్ స్వభావం కలిగి వుండటం వల్ల శరీరంలోని ఆమ్లత్వాన్ని సమతుల్యం చేస్తుంది. ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. మెటబాలిజం ప్రాసెస్‌ను మెరుగుపరుస్తుంది.
మట్టికుండలోని నీరు తాగినప్పుడు మెగ్నీషియం, కాల్షియం వంటివి శరీరానికి లభిస్తాయి. కుండలోని నీరు నేచురల్ ఫిల్టరేషన్ జరుపుకోవడం ద్వారా నీటికి రుచిని ఇస్తుంది. కాబట్టి కుండనీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కుండనీరు డీ హైడ్రేషన్‌ను నివారిస్తుంది.