1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Double Eviction In Bigg Boss Telugu 10

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌ 10.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్?

Bigg Boss Telugu 10
బిగ్ బాస్ నిర్వాహకులు ప్రేక్షకుల కోసం మరో పెద్ద ట్విస్ట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ వారాంతంలో షో నిర్వాహకులు మరో డబుల్ ఎలిమినేషన్‌కు ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వదంతులు షికారు చేస్తున్నాయి. ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు రోహిత్, వంశీ, రామ్ ప్రసాద్, ఝాన్సీ, శివ, రామకృష్ణ, వర్షిణి, సుధీర్. సోషల్ మీడియా ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం యాంకర్ వర్షిణి, సుధీర్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. 
 
ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ నిజంగా జరిగితే, ఈ ఇద్దరు కంటెస్టెంట్లు ఇంటి నుండి బయటకు వెళ్ళే అవకాశం ఉంది. నిర్వాహకులు నిజంగా డబుల్ ఎలిమినేషన్‌కు ప్లాన్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి వారాంతపు ఎపిసోడ్ కోసం వేచి చూద్దాం. గత వారాంతపు ఎపిసోడ్‌లో నాగార్జున దాక్ష, శాలినిలను ఎలిమినేట్ చేశారు. 
 
కాగా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారుతోంది. దాక్ష, శాలినిల ఎలిమినేషన్ తర్వాత, మిగిలిన కంటెస్టెంట్లు అంటే యాంకర్ వర్షిణి, రోహిత్, త్రిగుణ్, రామ్ ప్రసాద్, నరేష్, శ్వేతా నాయుడు, నీతూ నటరాజ్ తదితరులు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 
 
రోహిత్, వంశీ, రామ్ ప్రసాద్, ఝాన్సీ, శివ, రామకృష్ణ, వర్షిణి, సుధీర్‌లు ఎనిమిదో వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. తక్కువ ఓట్లతో అట్టడుగున ఉన్న వర్షిణి, సుధీర్‌లు మినహా అందరూ సేఫ్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నారు.  
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం - మద్యం మత్తులో సెల్ఫీ కోసం యత్నం...