గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (10:39 IST)

బురద నీటిలో కేరళ వ్యక్తి స్నానం.. యోగా చేశాడు.. ఎందుకు?

Kerala Man
Kerala Man
రోడ్లు అధ్వానంగా వుండటంతో కేరళ వ్యక్తి వినూత్నంగా నిరసన చేపట్టాడు. ఈ మేరకు హంజా పొరాలి అనే కేరళ వ్యక్తి రోడ్లు ఎంత దారుణం ఉ‍న్నాయో అధికారులకు తెలియజేసేలా అతను బురద నీటితో స్నానం చేయడమే కాకుండా ఆ బురద నీటిలోనే యోగాసనాలు వేశాడు. ఈ ఘటన కేరళలోని మలప్పురంలో చోటు చేసుకుంది. ఈ నిరసనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అదే సమయంలో ఆ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే లతిఫ్‌ రావడం, చూడటం జరిగింది. ఆయన ఏం మాట్లాడకుండా తన కారుని ఆ వ్యక్తి నుంచి తప్పించి వెళ్లిపోతున్నారు. 
 
అయినా సరే సదరు వ్యక్తి వదలకుండా ఆయన కారు వెళ్తున్న దారి వైపుగా ఉన్న గుంతల రోడ్డుకి అడ్డుపడుతూ.. ఆ బురద నీటిలోనే యోగా భంగిమలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఈ గుంతల రోడ్డు కారణంగానే ఇటీవలే ఎర్నాకులం జిల్లాలోని నెడుంబస్సేరి వద్ద 52 ఏళ్ల ద్విచక్ర వాహనదారుడుని ట్రక్‌ ఢీ కొని చనిపోయాడు.
 
దీంతో సదరు హంజా పోరాలి అధికారులు స్పదించే విధంగా ఈ వింత నిరసనను చేపట్టాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. దీంతో కేరళ హైకోర్టు వెంటనే ఈ విషయమై స్పందించి.... సుమోటోగా ఈ కేసును పరిగణలోని తీసుకుంది. తక్షణమే గుంతలను పూడ్చాలని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)ని కోరింది.