శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (19:23 IST)

బోటును చుట్టిముట్టిన జెల్లీ ఫిష్‌ల గుంపు.. పాల నురగలా..? (video)

Jelly Fish
Jelly Fish
సముద్రంలో ప్రయాణీస్తున్న బోటును జెల్లీ ఫిష్‌ల గుంపు చుట్టుముట్టింది. ఆ సమయంలో సముద్రాన్ని పరిశీలిస్తే.. బోటు చుట్టూ పాల నురగలా తెల్లని చుక్కల్లా కనిపించాయి. వివరాల్లోకి వెళితే.. ఇజ్రాయెల్‌లోని హైఫా బే ప్రాంతంలో ఈ దృశ్యం కెమెరాకు చిక్కింది. ఆ ప్రాంతంలో ఏటా జెల్లీ ఫిష్‌లు వలస వస్తుంటాయట. 
 
ఈసారి కూడా అలా కొన్ని జెల్లీ ఫిష్‌లు కనిపించడంతో.. ఇజ్రాయెల్‌కు చెందిన పార్క్స్ అండ్ నేచర్ అథారిటీ విభాగం డ్రోన్ కెమెరాతో చిత్రీకరించింది. ఈ వీడియోను తమ యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేసింది. ఈ జెల్లీ ఫిష్‌లకు సంబంధించిన వివరాలనూ వెల్లడించింది. భూమిమీద మొట్టమొదట పుట్టిన జీవ రాశుల్లో జెల్లీ ఫిష్‌లు కూడా ఒకటని శాస్త్రవేత్తలు చెప్పారు. 
 
నిజానికి ఈ జెల్లీ ఫిష్‌లు చాలావరకు హిందూ మహా సముద్ర ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ సమీపంలోని మధ్యధరా సముద్ర ప్రాంతానికి ఏటా వలస వస్తాయని అధికారులు తెలిపారు. భూమిమీద మొట్టమొదట పుట్టిన జీవ రాశుల్లో జెల్లీ ఫిష్‌లు కూడా ఒకటని శాస్త్రవేత్తలు చెప్పారు.