శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (08:23 IST)

నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53 -2 నిమిషాలు ఆలస్యంగా

isro launch pad
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్ఎల్వీ సీ53 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. అయితే ముందుగా నిర్ణయించిన సమయానికి కాకుండా రెండు నిమిషాలు ఆలస్యంగా పంపనుంది. 
 
ఈ ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి పంపించనుంది. ఈ వాహన నౌక సింగపూర్, కొరియా దేశాలకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇవి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఫోటోలను తీసి పంపేలా రూపొందించారు. 
 
దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తలు ఇప్పటిక ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 4.02 గంటలకు కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. ఇది నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగుతుంది. కౌంట్‌డౌన్ ముగిసిన తర్వాత గురువారం సాయంత్రం 6 గంటల 02 నిమిషాలకు పీఎస్ఎల్వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.