Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..
నవరాత్రి అనేది ఆధ్యాత్మిక ఆత్మపరిశీలన, రంగురంగుల ఆనందోత్సాహాల కాలం, ఈ సందర్భంగా సాత్విక ఆహారం తీసుకోవడం.. ఉపవాసం వుండటం చాలామంది చేస్తుంటారు. ఇంకా ఉపవాసం వుండే వారు పోషకాల ఆహారంతో కూడిన రుచికరమైన ఆహారం తీసుకోవాలి.
ఈ నవరాత్రి, తేలికైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలను ఎంచుకోవచ్చు. అందులో ఓ రెండింటిని తయారు చేయడం ఎలాగో చూద్దాం. పచ్చి కేరళ అరటిపండ్లను సన్నగా కోసి, కొబ్బరి నూనెలో వేయించి.. కాస్త నెయ్యి చేర్చి.. ఉప్పు చల్లి తీసుకోవాలి. ఈ క్లాసిక్ అరటి చిప్స్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి తగిన పోషకాలను అందిస్తాయి.
అలాగే నానబెట్టిన సగ్గుబియ్యం, మెత్తగా చేసిన బంగాళాదుంపలు, వేయించిన వేరుశనగలు, తేలికపాటి మసాలా దినుసులు కలిపి... చిన్న చిన్న పట్టీలు తయారు చేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు నూనెలో వేయించాలి. అంతే సాబుదానా టిక్కీలు రెడీ. వీటిని సర్వింగ్ ప్లేటులోకి తీసుకుని తినేయవచ్చు. సగ్గుబియ్యం ఉపవాసం సమయంలో శక్తిని ఇస్తుంది. వేరుశనగలు ప్రోటీన్‌ను ఇస్తాయి.