1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Nara Lokesh Bumper Offer To Jagan

టీవీల్లో కాదు.. లైవ్‌గా మ్యాచ్ చూడండి.. టికెట్ నేను కొనిపెడతాగా.. జగన్‌కు లోకేష్ ఆఫర్

Nara Lokesh
ఏపీ మంత్రి నారా లోకేష్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూడటానికి కొలంబోకు వెళ్లడంపై వైకాపా రచ్చ రచ్చ చేస్తోంది. నారా లోకేష్ మ్యాచ్‌లో కనిపించిన రోజు నుండి, మ్యాచ్ టికెట్, విమాన టికెట్ కొనడానికి ప్రజల డబ్బునే ఉపయోగించారని వైకాపా ఆరోపించింది. 
 
దీనిపై వైకాపా చీఫ్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించారు. ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. వాస్తవానికి, నారా లోకేష్ తనలాగే టెలివిజన్‌లో దీన్ని చూసివుండవచ్చని జగన్ తెలిపారు. 
 
ఈ అంశంపై సోమవారం లోకేష్‌ను  మీడియా చిట్ చాట్ సందర్భంగా మరోసారి ఖర్చుల గురించి అడిగారు. లోకేష్ తన దేశాన్ని ప్రేమిస్తున్నానని, క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లడంలో తప్పు లేదని అన్నారు. భారతదేశం ఫైనల్స్‌కు చేరుకుంటే టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చూడటానికి వెళ్తానని చెప్పారు. 
 
ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈసారి, వైకాపా చీఫ్ జగన్‌కు ఆసక్తి ఉంటే ఆయన కోసం మ్యాచ్ టికెట్ కొనిపెడతానని నారా లోకేష్ తెలిపారు. టీవీల్లో మ్యాచ్ చూసేందుకు బదులు జగన్ గ్రౌండ్‌లో ఎంచక్కా మ్యాచ్‌ను లైవ్‌గా చూడొచ్చునని చెప్పారు. మరి ఈ ఆఫర్‌ను జగన్ స్వీకరిస్తారా లేదా అనే దానిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 
తర్వాతి కథనం
రంగారెడ్డిలో ట్రిపుల్ రైడింగ్.. ఇద్దరు యువకుల మృతి