Samantha: యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం శారీరకంగా సిద్ధమైన సమంత
Maa inti bagaram - Samantha
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మా ఇంటి బంగారం సినిమాను యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. యాక్షన్ డ్రామా మూవీ అందరికీ నచ్చేలా, అన్ని అంశాలతో రూపొందుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను బలమైన భావోద్వేగాలతో పాటు ఉత్కంఠతను రేపే యాక్షన్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.
చిత్ర యూనిట్ లేటెస్ట్‌గా సమంత ఉన్న కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది, ఇది సినిమాకి ప్రత్యేకమైన విజువల్ లుక్‌ను తీసుకొచ్చింది. ఇది యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం సమంత శారీరకంగా సిద్ధమైన తీరుని హైలైట్ చేస్తోంది. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈసారి సమంత ఎలా మెప్పించనుందోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాను సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు.
