సంబంధిత వార్తలు
- Egg Prices: కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. ఒక్క గుడ్డు ధర ఏకంగా ఏడు రూపాయలు
- Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు
- కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!
- గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?
- అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?
మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
కల్తీ.. ఆమాటకొస్తే తిరుమల లడ్డు సైతం కల్తీ అయిపోయింది. ప్రజల ఆరోగ్యం గురించి పట్టని పరిస్థితులు దాపురించాయి. కనుక ఏ పదార్థం తినాలన్నా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుని తినాల్సి వుంటుంది. కల్తీలేని కోడిగుడ్లు తింటూ, కల్తీ కాని పాలు తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శరీరం బలంగా, అవసరమైనంత శక్తి చేకూరాలంటే కోడిగుడ్లు తింటూ, పాలు తాగాలని చెబుతుంటారు వైద్యులు. ఈ గుడ్లు, పాలు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కోడిగుడ్లు, పాలు రెండూ ప్రోటీన్ యొక్క మంచి మూలాలు, ఇవి కండరాలు, కణజాలం నిర్మాణానికి మేలు చేస్తాయి.
గుడ్లు, పాలు రెండూ కాల్షియం వనరులు కనుక ఎముక పుష్టికి దోహదపడతాయి.
కోడిగుడ్లు లోని కోలిన్ మెదడు పనితీరు, కణ త్వచం ఏర్పడటానికి ముఖ్యమైన పోషకం.
కోడిగుడ్లులో వుండే ఫోలేట్ పిండం అభివృద్ధికి సహాయపడుతుంది.
గుడ్లు లోని విటమిన్ డి కండరాల ఆరోగ్యానికి, పెరుగుదలకు తోడ్పడుతుంది.
కోడిగుడ్లు లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కండరాల ఆరోగ్యం, పెరుగుదలకు తోడ్పడతాయి.
కోడి గుడ్లు, పాలు రెండింటీలోనూ ఐరన్ ఉంటుంది కనుక వీటిని తీసుకుంటుండాలి.
