శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (16:47 IST)

జూలై నుంచి మొబైల్ మార్కెట్‌లోకి వన్ ప్లస్ 5జీ ఫోన్

oneplus
మొబైల్ వినియోగదారులకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వన్ ప్లస్ శుభవార్త చెప్పింది. జూలై ఒకటో తేదీ నుంచి వన్ ప్లస్ నార్డ్ 2టీ 5జీ స్మార్ట్ ఫోనును అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ ఫోన్ 8జీ ర్యామ్, 128 జీపీ స్టోరేజ్ వేరియంట్, 12జీ ర్యామ్, 256 జీవీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ వివరాలను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు ఈ 5జీ స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్‌లోకి జూలై ఒకటో తేదీ నుంచి విడుదలకానుంది. ఈ ఫోన్ విక్రయాలు జూలై 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు వేరియంట్లలో తయారు చేశారు. ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ.28,999, రూ.33,999గా నిర్ణయించినట్టు సమాచారం. 
 
అయితే, ఈ ధరల వివరాలను వన్ ప్లస్ కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సివుంది. ఇతర ఫోన్లను కొనుగోలు చేసినట్టుగానే వన్ ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ఈకామర్స్ సైట్లలో బుక్ చేసుకోవాల్సివుంది. ఈ ఫోనును షాడో గ్రే, జేడ్ ఫాగ్ వంటి రంగుల్లో అందుబాటులోకి తీసుకునిరానున్నారు.