శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జూన్ 2022 (16:34 IST)

కొత్త నాణేలను విడుదల చేసిన ప్రధాని మోడీ

new coins
దేశంలో కొత్త నాణేలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం విడుదల చేశారు. 75 యేళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో ఈ నాణేలను విడుదల చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి విడుదల చేసిన నాణేలలో రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 మారకవు పిలువ కలిగిన కొత్త నాణేలు ఉన్నాయి. 
 
ఇవి కేవలం స్మారక నాణేలు మాత్రమే కాదని చెలామణిలో కూడా ఉన్నాయని తెలిపారు. పైగా, ఇవి దేశాభివృద్ధి కోసం పనిచేసేలా ప్రజల్లో స్ఫూర్తిని నింపేలా ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా, ఈ నాణేలను అంధులు సైతం సులభంగా గుర్తించేలా తయారు చేయడం గమనార్హం.