Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా
వైవిధ్యమైన చిత్రాలను ఓవర్సీస్ ప్రేక్షకులకు అందించే లక్ష్యంగా అడుగులేస్తోన్న ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అథర్వణ భద్రకాళి పిక్చర్స్ మరో డిఫరెంట్ మూవీతో మెప్పించటానికి సిద్ధమవుతోది. ఆ సినిమా ఏదో కాదు..
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ .. తారగణంగా సామాజిక స్పృహతో రూపొందుతోన్న చిత్రం దండోరా. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో గ్లింప్స్, టీజర్, సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. డిసెంబర్ 25న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతోంది.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం కలర్ ఫోటో..బ్లాక్‌బస్టర్ మూవీ బెదురులంక 2012 చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్నఈ సినిమాలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
దండోరా సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో ఆడియెన్స్‌ను అలరించటానికి సిద్ధమవతోంది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. టీజర్‌తో దర్శకుడు బలమైన అంశాన్ని చెప్పాలనకుంటున్నాడనే విషయం తెలుస్తుంది. ఈ సినిమాలోని పాటలు టి సిరీస్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి.