శుక్రవారం, 5 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 డిశెంబరు 2025 (12:10 IST)

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

Nara lokesh
వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించిన తర్వాత పాలకొండలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నారా లోకేష్ మాట్లాడుతూ, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చినందుకు, తద్వారా గత ప్రభుత్వ సైకో పాలన నుండి ఏపీని విముక్తి చేసినందుకు టిడిపి కార్యకర్తలను ప్రశంసించారు. 
 
బెదిరింపులు, హింస, తప్పుడు కేసులను ఎదుర్కొన్నప్పటికీ పార్టీ కార్యకర్తలు దృఢంగా నిలిచినందుకు నారా లోకేష్ప్రశంసలు కురిపించారు. 2024లో పార్టీ సాధించిన అఖండ విజయానికి కార్యకర్తల దృఢత్వమే కారణమని నారా లోకేష్ అభివర్ణించారు. చారిత్రాత్మక ఎన్నికల విజయాల వెనుక ఉన్న చోదక శక్తి అని వైకాపాపై ఫైర్ అయ్యారు. ఉత్తర ఆంధ్రలో ప్రధాన ప్రాజెక్టులు, పెన్షన్ల విస్తృత పరిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ఆయన హైలైట్ చేశారు. 
 
టీడీపీ పార్టీ కార్యకర్తలను గౌరవంగా చూసుకోవాలని, చట్టబద్ధంగా వారి బాధ్యతలను నెరవేర్చాలని లోకేష్ అధికారులను కోరారు. 2029లో సంకీర్ణ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చేలా క్రమశిక్షణ, దృఢ సంకల్పంతో పనిచేయడం కొనసాగించాలని ఆయన పార్టీని కోరారు.