రేపు ఏపీ సీఎం జగన్ హస్తిన పర్యటన - 4.30 గంటలకు ప్రధానితో భేటీ
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం హస్తినకు వెళుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యేందుకు ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. ఇందుకోసం సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు. ముఖ్యంగా, పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని, షెడ్యూల్ 9, 10 కింద జాబితా చేయబడిన ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల విభజనను వేగవంతం చేయాలని ప్రధాని మోడీకి విన్నవించనున్నారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా మంజూరు చేసే దీర్ఘకాల వాగ్దానం, దిశ చట్టానికి కేంద్రం ఆమోదం తెలపాలని కోరనున్నారు. అలాగే, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.