సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

జూలై 4న భీమవరంకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ

pmmodi
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 4వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రానున్నాయి. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం ఆకివీడులో విలేకరులతో మాట్లాడుతూ, జూన్ 7వ తేదీన రాజమండ్రిలో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని, జూలై 4వ తేదీన భీమవరంలో నిర్వహించనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటారని సోము వీర్రాజు తెలిపారు.