సంబంధిత వార్తలు
- Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్
- వై.ఎస్. గురించి మీకు ముందే తెలుసా ! అని అడిగారు : దర్శకుడు శశికిరణ్ తిక్క
- అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి
- Businessman: రూ.15కోట్లు అప్పుంది.. కన్నబిడ్డ పరిస్థితి బాగోలేదు.. లైవ్లోనే ఆత్మహత్య
- అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా... లైవ్లో చూస్తూ పైశాచికం...
Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా
Sidhu Jonnalagadda, Raashi Khanna, Neeraj Kona, TG Vishwa Prasad
మల్లికా గంధ లవ్ అండ్ మ్యూజికల్ మ్యాజిక్ తో మనసును తాకే అద్భుతమైన పాట. ట్యూన్, విజువల్స్ ప్రతీదీ ప్రేమ భావోద్వేగాలను బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేస్తోంది. థమన్ ఎస్ కంపోజిషన్ బ్రిలియంట్ గా వుంది. తంబురా, ఫ్లూట్ లాంటి ట్రెడిషనల్ వాయిద్యాల్ని మోడరన్ టచ్ లో వినిపించడం అదిరిపోయింది.
సిద్ శ్రీరామ్ వాయిస్ మాటల్లో చెప్పలేనంత ఫీల్ ని ఇస్తుంది. అతని వాయిస్ లోని ఇంటెన్సిటీ పాటకి ఓ ప్రత్యేక స్టయిల్ ని తీసుకొచ్చింది. దర్శకురాలు నీరజా కోన, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్ కలసి ప్రేమ ప్రపంచాన్ని తెరపై అద్భుతంగా మలిచారు. ప్రతీ ఫ్రేమ్ విజువల్ ఫీస్ట్ లా వుంది.
సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఇద్దరి నేచురల్ బాడీ లాంగ్వేజ్ సాంగ్ కు మరింత బ్యూటీని యాడ్ చేశాయి. రొమాంటిక్ సీన్స్, జోష్ నింపే డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు. లవ్ అండ్ మ్యూజికల్ సెలబ్రేషన్స్ కు ఇది పర్ఫెక్ట్ సాంగ్ గా నిలిచింది.
ఈ మూవీలో మరో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొళ్ల ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్స్ షీతల్ శర్మ. సినిమా ఈ దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కానుంది.
తారాగణం: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
