గురువారం, 24 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 23 జులై 2025 (18:06 IST)

వై.ఎస్. గురించి మీకు ముందే తెలుసా ! అని అడిగారు : దర్శకుడు శశికిరణ్‌ తిక్క

Shasikiran Thikka,  Shekhar Kammula
Shasikiran Thikka, Shekhar Kammula
ఓ వ్యక్తి కోసం ఫోన్ చేస్తే అడవిశేష్ లైన్ లోకి వచ్చాడు. వెంటనే నా వాయిస్ విని.. అమెరికా నుంచి ఎప్పుడొచ్చావ్. అని అడగడం, ఓసారి రమ్మని పిలవడం.. వెంటనే నేను వెళ్ళడం. అక్కడ శేఖర్ కమ్ములగారు వుండడం జరిగింది. ఆయన్ను పరిచయం చేయడంతో మాటల్లో, ఆయన హ్యాపీడేస్ హిందీ వర్షన్ షూటింగ్ చేస్తున్నారని తెలిసింది. ఆ సినిమాకు నేను పనిచేశాను. కానీ కొన్ని కారణాలవల్ల అది పూర్తి కాలేదని... దర్శకుడు శశి కిరణ్ తిక్క తెలియజేశారు.
 
గూఢచారి, మేజర్ సినిమాలకు దర్శకత్వం వహించిన శశి కిరణ్ తిక్క కొంత గేప్ తీసుకున్నారు. మేజర్‌ షూటింగ్‌లో ఉండగానే నాన్నని కోల్పోయిన శశికి ప్రస్తుతం తండ్రి రూపంలో తోడుగా ఉన్నది శేష్ అంటూ వివరించారు. త్వరలో మరలా మెగా ఫోన్ పట్టుకుంటారని ఆశిద్దాం.
 
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో గత అనుభవాలను చెప్పుకొచ్చారు దర్శకుడు శశికిరణ్. ముఖ్యంగా అందులో శేఖర్ కమ్మల దర్శకత్వంలో రూపొందిన లీడర్ ప్రత్యేకమైంది. సినిమా నేర్చుకుందంతా దర్శకులు శేఖర్‌ కమ్ముల గారి దగ్గరయితే దర్శకునిగా తన కలను నమ్మింది మాత్రం అడివి శేష్‌ని స్క్రీన్‌పై ఊహించుకున్నప్పుడే. తొలిసినిమా ‘గూడచారి’  స్పై సినిమా అయితే రెండో సినిమా ‘మేజర్‌’...రెండు సినిమాల్లోనూ కామన్‌ పాయింట్‌ దర్శకుడు శశికిరణ్‌ తిక్క, హీరో అడివి శేష్‌. గత పదిహేనుళ్లేగా దగ్గరనుండి శశిగారు చాలా బాగా తెలుసు. వైయస్‌. రాజశేఖర్‌ రెడ్డి గారు మరో పదిరోజుల్లో చనిపోతారనగా శశికిరణ్‌ తిక్క దాదాపు అలాంటి విజువల్సే తెరకెక్కించారు. అందుకు కారణమేమిటి? అనేది ఆసక్తిగా అనిపిస్తుంది.
 
శశికిరణ్ మాట్లాడుతూ, నేను శేఖర్ గారికి కలిసినప్పుడు హ్యాపీడేస్ హిందీ వర్షన్ కోసం నటీనటులు ఎంపిక చేసుకుంటున్నారు. అందులో నేను కూడా వున్నా. చాలామందిని ఎంపికకు పిలిచారు. షూటింగ్ ప్రారంభిస్తే శేఖర్ గారి అమిగోస్ బేనర్ బాలీవుడ్ కు వెళ్ళాల్సింది. కానీ ఎందుకనో అది ముందుకు సాగలేదు.  కానీ షడెన్ గా లీడర్ సినిమా తెర ముందుకు వచ్చింది.  ఆ సినిమా అయ్యాక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా చేశారు. దానితో హ్యాపీడేస్ హిందీ సినిమా అటకెక్కింది. 
 
ఇక అన్నిటికంటే మాకూ థ్రిల్ కలిగించింది లీడర్ సినిమా షూటింగ్. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు మరణానికి ముందే లీడర్ షూట్ చేశాం. కానీ కథ ప్రకారం వై.ఎస్. గారి మరణం కూడా షూట్ చేసేశాం. మేం షూట్ చేశాక వారం రోజుల్లో ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ముందే మీకు తెలుసా? అన్నట్లుగా చాలామంది ప్రశ్నలు సంధించారు. కానీ అలా జరగడం కూడా మేం షాక్ కు గురయ్యాం. వై.ఎస్. గారు చనిపోయారు అన్న తర్వాత చాలామంది జీర్ణించుకోలేక చనిపోయిన వారూ వున్నారు. కానీ ప్రేక్షకులకు, జనాలకు తెలిసిందేమిటంటే... వై.ఎస్. గారు చనిపోాయాక తీశాం అన్నారు. శేఖర్ గారి కలం నుంచి ఆ సన్నివేశం ఎందుకు రాసుకున్నారో ఇప్పటికీ అర్థంకాలేదు. ఓసారి నేను అడిగితే సిన్సియర్ గా కథ రాసుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయని చెప్పారు.