గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (12:04 IST)

అమిత్ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యారు : మంత్రి హరీష్ ప్రశ్న

harish rao
తెలంగాణాలో ఒక కుటుంబ పాలన సాగుతోందంటూ గురువారం హైదరాబాద్‌ నగర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఘాటుగానే స్పందించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు వచ్చిన ప్రధాని చిల్లర మాటలు మాట్లాడారంటూ మండిపడ్డారు. 
 
మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతోనే పొత్తుపెట్టుకున్న విషయాన్ని ప్రధాని మోడీ మరిచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. మోడీ నోట కుటుంబ పాలన మాట రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి ఎలా అయ్యారంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోడీకి లేదన్నారు. తెలంగాణాను ఒక కుటుంబంలా సీఎం కేసీఆర్ భావించి పాలిస్తున్నారన్నారు. 
 
కాగా, ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ-హైదరాబాద్) ద్వి దశాబ్ది వేడుకలు గురువారం జరుగగా, ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఓ కుటుంబ పాలన సాగుతోందన్న సంగతి యాతవ్ దేశం గమనిస్తోందని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.