వలస పక్షులు ఇష్టమైన ప్రాంతాలకు వస్తుంటాయి.. పోతుంటాయి..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సెటైరికల్ ట్వీట్ చేశారు. వలస పక్షులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వస్తుంటాయి. పోతుంటాయి. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించి సంతోషంగా వెళ్తాయన్నారు.
ఇవాళ ప్రపంచ వలస పక్షుల దినోత్సవం కావడం యాదృచ్ఛికమని హరీశ్‌రావు పేర్కొన్నారు. #AmitShahVisitsTelangana, #WorldMigratoryBirdDay అనే హ్యాష్ ట్యాగులను హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇలా పోస్టు చేయడంతో ప్రస్తుతం ఈ సెటైర్ తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ మారింది.
బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా.. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు.
అంతకుముందే అమిత్‌షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై బీజేపీకి కక్ష, వివక్ష అలానే ఉందని మంత్రి ఆరోపించారు. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణపై బీజేపీది అదే కక్ష. ఎనిమిదేళ్లు గడిచినా అదే వివక్ష. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదు. ప్రతిసారి వచ్చుడు.. స్పీచులు దంచుడు.. విషం చిమ్ముడు.. మళ్లీ పత్తా లేకుండా పోవుడు ఇదే బీజేపీ కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు.