సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మే 2022 (14:31 IST)

కోవిడ్‌తో అనాధలైన చిన్నారుల కోసం రూ.10 లక్షల సాయం

modi
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల సంక్షేమం కోసం కీలక ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 18 ఏళ్లు దాటిన తర్వాత రూ.10 లక్షల సాయంతో పాటు పైచదువులకు హామీ ఇచ్చారు. కోవిడ్ కారణంగా పేరెంట్స్ కోల్పోయిన చిన్నారులకు రూ.4000 అందజేయనున్నట్లు ప్రకటించారు. 
 
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ పథకం ద్వారా సాయం అందిస్తామని ప్రధాని ప్రకటించారు. చిన్నారులకు సాయంపై ఓ ప్రకటన జారీ చేసింది ప్రధాని కార్యాలయం. అనాథ చిన్నారుల పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్లు తెరుస్తామని తెలిపింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ.10 లక్షలు అందేలా ప్రత్యేకంగా రూపొందించిన పథకానికి పీఎం కేర్స్ ద్వారా నిధులు సమకూర్చుతామని పేర్కొంది.
 
ఈ పథకాలకు అర్హులు కాని వారికి పీఎం కేర్స్ ద్వారా వాటికి సమానంగా ఉపకారవేతనాలు.. అనాథలైన చిన్నారులందరినీ ఆయుష్మాన్ భారత్ స్కీం లేదా ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద నమోదు. రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.