బీజేపీలోకి హార్దిక్ పటేల్.. మోదీ నాయకత్వంలో చిన్న సైనికుడిగా పనిచేస్తా
గుజరాత్‌లో కాంగ్రెస్‌కు షాకిచ్చేందు హార్దిక్ పటేల్ సిద్ధమయ్యారు. ఇటీవల హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చిన హార్దిక్ పటేల్ జూన్ 2న బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సోమవారం రోజున ట్విటర్ వేదికగా హార్దిక్ పటేల్ ఆమ్ ఆద్మీ పార్టీపై విరుచుకుపడ్డారు.
పంజాబ్‌లో సింగర్ సిధు మూసేవాలా హత్యకు ఆప్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. తాను బీజేపీలో చేరడం లేదని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ ఉంటే వెల్లడిస్తానని కూడా ఆ ట్వీట్‌లో హార్దిక్ పేర్కొన్నారు. అయితే బీజేపీ వర్గాలు మాత్రం హార్దిక్ పటేల్ తమ పార్టీలో చేరబోతున్నారని చెబుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశానికి సేవ చేయడానికి తాను "చిన్న సైనికుడు"గా పనిచేస్తానని హార్దిక్ పటేల్ చెప్పారు. బీజేపీలో చేరేందుకు ముందు అహ్మదాబాద్‌లోని తన నివాసంలో పటేల్ పూజలు నిర్వహించారు.
జాతీయప్రయోజనాలు, రాష్ట్రప్రయోజనాలు, ప్రజాప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాల భావాలతో ఈ రోజు నుంచి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను. విజయవంతమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి సేవ చేసే ఉదాత్తమైన సేవలో నేను ఒక చిన్న సైనికుడిగా పనిచేస్తాను" అని పటేల్ ట్వీట్ చేశారు.