గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (14:55 IST)

సోనియా - రాహుల్‌లకు సమన్లు జారీచేసిన ఈడీ

sonia - rahul
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఎన్‌‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో వీరిద్దరూ తమ ఎదుట గురువారం విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో పేర్కొన్నారు. 
 
ఒకపుడు అత్యంత ప్రజాదారణ పొందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను కాంగ్రెస్ పార్టీ నడుపుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ పత్రిక ముద్రణను మూసివేసింది. అయితే, ఈ పత్రికకు రాజధాని ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని రాహుల్ గాంధీ తన ఖాతాలో చూపించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
 
ఇదే అంశంపై బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ పాటియాల్ హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టుకు సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు మెట్లెక్కారు. ఇపుడు ఇదే కేసులో ఈడీ సమన్లు జారీ చేయడం, విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.