సోనియా దేశ ద్రోహి - వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు : కేఏ పాల్
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఒక దేశ ద్రోహి అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. పైగా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 48 సీట్లకు పరిమితమైందని, వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్య 30 లేదా 20కు చేరుతుందన్నారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతిమయ పార్టీలేనని ఆయన అన్నారు.
బెంగుళూరులో రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌పై జరిగిన సిరా దాడిని ఆయన ఖండించారు. తెలంగాణలో రెడ్డి సింహగర్జన పేరుతో సభలో మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిపై స్పందిస్తూ, అది రెడ్డి వర్గాల మధ్య జరిగిన గొడవ అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సరికాదని, మాటల ద్వారా దాడి చేసుకోవచన్నారు.