గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: మంగళవారం, 31 మే 2022 (11:14 IST)

సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదని... దేశద్రోహి..! చెప్పిందెవరు?

ka paul
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదని... దేశద్రోహి అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహి పార్టీ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని చెప్పారు. 
 
పార్టీల కంటే మనకు దేశమే ముఖ్యమని అన్నారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి పార్టీలేనని విమర్శించారు. జాతీయ రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ పై జరిగిన దాడిని కేఏ పాల్ ఖండించారు. 
 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని పాల్ సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 48 ఎంపీ స్థానాలకు పరిమితమయిందని... రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 30 లేదా 20కి చేరుతుందని జోస్యం చెప్పారు. 
 
హైదరాబాదులో రెడ్డి గర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ... అది రెడ్డి వర్గాల మధ్య జరిగిన గొడవ అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సరికాదని... మాటల ద్వారా దాడి చేయడం కూడా తప్పేనని అన్నారు.