సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మే 2022 (10:27 IST)

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు డాక్టర్ లక్ష్మణ్‌

Laxman
తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ నగరానికి చెందిన పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్‌ను భారతీయ జనతా పార్టీ సోమవారం రాజ్యసభకు నామినేట్ చేసింది.
 
బీజేపీ తరపున పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థుల జాబితాను తాజాగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులో ఉత్తరప్రదేశ్‌ నుంచి డాక్టర్ లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపించనుంది. ఈయన ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా ఉంటారు. 
 
గతంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. డాక్టర్ లక్ష్మణ్ 2020లో పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా మారడానికి ముందు బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.