బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మే 2022 (14:35 IST)

చురుకుగా నైరుతి రుతుపవనాలు: ఏపీ, తెలంగాణల్లో వర్షాలు

Monsoon
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇదివరకే కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు వేగంగా ఏపీ, తెలంగాణ వైపు ప్రయాణిస్తున్నాయి.  
 
నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
 
ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. 
 
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడతాయి. రుతుపవనాల సీజన్‌లో అధిక వర్షపాతాన్ని చూడొచ్చు. ముఖ్యంగా ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో ఎక్కువ వర్షాలుంటాయి.