గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 మే 2022 (19:23 IST)

ఏపీలో భారీ వర్షాలు.. పిడుగులు పడే ప్రమాదం.. జాగ్రత్త అవసరం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇందుకు కారణంగా దేశంలోకి నైరుతి రుతుపవనాలు రావడమే. అండ‌మాన్ వ‌ద్ద తీరాన్ని తాక‌డంతో రుతుప‌వ‌నాల ఆగ‌మ‌నం ప్రారంభ‌మైన‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. 
 
ఈ ప్ర‌భావంతో ఏపీలో ప‌లుచోట్ల ఉరుములు, మెరుపుల‌తో జ‌ల్లులు ప‌డుతున్నాయి. రాయ‌ల‌సీమ‌లోని కొన్ని చోట్ల పిడుగులు పడినట్లు తెలుస్తోంది. 
 
కూలీలు, బ‌య‌ట తిరిగే వారు ఉరుములు, మెరుపుల స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఎత్తైన ప్ర‌దేశాలు, పెద్ద పెద్ద చెట్ల నీడ‌న ఉండొద్ద‌ని అధికారులు సూచిస్తున్నారు.