మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (21:26 IST)

ఎప్పటికైనా ఏపీ రాజధాని అమరావతే : జీవీఎల్

gvl narasimha
ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం రూ.1000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. కానీ, వైకాపా సర్కారు అమరావతిని అటకెక్కించిందని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి విషయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశామని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం తమ భూములను త్యాగం చేసిన రైతుల పక్షానే ఈ పిటిషన్ దాఖలు చేశామని ఆయన తెలిపారు. 
 
అదేసమయంలో అమరావతి అభివృద్ధి విషయంలో నిధుల అవసరం పెద్దగా లేదని జీవీఎల్ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం మరో వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అయినా అభివృద్ధికి ఐదేళ్ళ సమయం అంటే కోర్టు తీర్పును ఉల్లంఘించినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.