1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (18:54 IST)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీకాలం పొడగింపు

sameer sharma
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీకాలాన్ని ఆర్నెల్లపాటు పొడగిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన గతంలో కేంద్రానికి లేఖ రాశారు. ఏపీ సీఎస్‌‍గా ఉన్న సమీర్ శర్మ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. 
 
దీంతో ఆయన పదవీకాలాన్ని మరో ఆర్నెల్లపాటు పొడగించాలని కోరుతూ సీఎం జగన్ లేఖ రాశారు. జగన్ రాసిన లేఖకు కేంద్రం సమ్మతం తెలిపుతూ సమీర్ శర్మ సర్వీసును నవంబరు 30వ తేదీ వరకు పొడగించింది. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది.