మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (14:12 IST)

అసని తుఫాను ఎఫెక్టు.. తగ్గిన దిగుబడి.. ఆకాశంలో ధరలు

Tomato
దేశంలో టమోటా ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. వీటి ధరలు మరోమారు పెరిగాయి. ఫలితంగా టమోటా ధర కొండెక్కింది. దేశంలోని అన్ని ప్రధాన మార్కెట్‌లలో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టమోటా ధరలను పరిశీలిస్తే, కర్నూలు మార్కెట్‌లో కేజీ టమోటా ధర రూ.80 వరకు పలుకుతోంది. రైతు బజారులో అయితే ఈ ధర రూ.70గా ఉంది. చిల్లర మార్కెట్‌లో మాత్రం ఇది వంద రూపాయల వరకు పలుకుతోంది. 
 
టోమోటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా.. అసని తుఫాను ప్రభావంతో పాటు పలు రాష్ట్రాల్లో టమోటా దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితి నెలాఖరు వరకు ఇదే విధంగా ఉండేలా కనిపిస్తుంది. దీంతో మే నెలాఖరు వరకు టమోటా ధర ఆకాశంలోనే ఉండేలా కనిపిస్తుంది. 
 
చిత్తూరూ జిల్లాలోని మదనపల్లి మార్కెట్‌లో కేజీ టమోటా ధర రూ.56 పలుకుతోంది. గత నాలుగేళ్ళుగా అన్‌సీజన్‌లో ఇదే తరహా ధర పలుకుతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో టమోటా దిగుబడులు లేకపోవడంతో వీటి ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పొచ్చు.