శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మే 2022 (13:51 IST)

మా గోడు విని కొత్త జీవో ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు : హీరో మహేష్

Mahesh Babu
మా బాధలు, గోడు విని అందుకు తగినట్టుగా కొత్త జీవో జారీ చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టాలీవుడ్ హీరో మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు కూడా ఇలానే ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రభుత్వం, చిత్రపరిశ్రమ ఎంతో సమన్వయంతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. పేర్ని నాని గారికి థ్యాంక్స్ అంటూ మహేష్ బాబు చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
అయితే, సినిమా టిక్కెట్ల అంశంపై ప్రభుత్వం కొత్తగా జారీచేసిన జీవోపై టాలీవుడ్ ప్రముఖుల్లో ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. ఒక్క మెగాస్టార్ చిరంజీవి మినహా మరో హీరో లేదా డైరెక్టర్ లేదా నిర్మాత స్పందించలేదు. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైన వారిలో చిరంజీవి మినహా ఏ ఒక్కరూ స్పందించక పోవడం గమనార్హం.