బుధవారం, 1 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 15 సెప్టెంబరు 2025 (22:27 IST)

ఉచిత బస్సులతో మా బతుకులు బస్టాండ్ అయ్యాయంటున్న కండెక్టర్ (video)

lady conductor
ప్రయాణికులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత తమ బతుకులు బస్టాండులా మారిపోయిందంటూ పలువురు ఆర్టీసి ఉద్యోగులు వాపోతున్నారు. తమ బాధను ఓ మహిళా కండక్టర్ ఏకంగా ఓ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అందులో ఆమె మాట్లాడుతూ... అధికారులకు నమస్కారం, చూడండి ప్రయాణికులు రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు. బస్సు కెపాసిటీకి మించి 150 నుంచి 170 మంది ఎక్కుతున్నారు.
 
ఫుట్ బోర్డు నుంచి పైకి రమ్మంటే మామీదే కలబడుతున్నారు. ఎందుకండీ మా ఉద్యోగాలతో, మా ఊపిరితో మా కుటుంబాలతో ఆడుకుంటున్నారు. అధికారులెవ్వరికీ కూడా మేము చేసే సేవల పట్ల జాలి, దయ లేదా? రోడ్డు మీద పారిశుద్ధ్య కార్మికుల కంటే మా బ్రతుకు హీనమైపోయింది. మా ఊపిరి ఈ ఆర్టీసీ బస్సుల్లోనే పోయేలా వుంది ఈ బస్సుల్లో.
 
బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టరుపై తిరగబడటం. గొర్రెల్లా అరుస్తున్నా పైకి ఎక్కకపోవడం. ఏంటండీ ఈ బతుకు, మీరిచ్చే జీతాలకంటే కూడా మేము ఎక్కువే కష్టపడుతున్నాం అంటూ ఆవేదన వెల్లిబుచ్చారు.