శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (10:55 IST)

పులివెందుల వద్ద 30 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు

buses
కడప జిల్లాలోని పులివెందులలో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థకు చెందిన పల్లెవెలుగు బస్సు ఒకటి లోయలో పడిపోయింది. ఎదురుగా వస్తున్న వాహనానికి తప్పించే ప్రయత్నంలో భాగంగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
కదిరి నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు పులివెందుల సమీపంలోని డంపింగ్ యార్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో డ్రైవర్ బ్రేకులు వేశారు. దీంతో బస్సు నియంత్రణ కోల్పోయి చెట్లను ఢీకొట్టుతూ 30 అడుగుల లోతులో పడిపోయింది. క్షతగాత్రులను టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పరామర్శించారు. పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వైద్యులకు సూచించారు.