గుంటూరు జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్.. ఎందుకంటే?
వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. అత్యాచార, అఘాయిత్యాల బారిన పడిన ఇద్దరు యువతుల కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 23న గుంటూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు.
టీడీపీ కార్యకర్త, రౌడీ షీటర్ దాడితో కోమాలోకి వెళ్లిన తెనాలికి చెందిన యువతి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. బద్వేల్‌లో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని కూడా జగన్ పరామర్శంచనున్నారు. ఈ పర్యటనల అనంతరం ఆయన పులివెందులకు చేరుకుంటారు.