సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 18 జూన్ 2024 (12:29 IST)

మీడియా Live ఇస్తుందా? తాడేపల్లిలో ఏమి పని నీకు ? పులివెందుల ప్రజలకు సేవ చేయమ్మా

Jagan Tadepalli house
వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద మీడియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందనీ, క్యాంప్ ఆఫీస్ మెయిన్ గేటు వద్ద లైవ్ లతో హడావుడి చేస్తున్నారనీ, టీడీపి మనుషులను మోహరింపజేసి రెచ్చగొట్టేలా కామెంట్లు చేస్తున్నారంటూ వైసిపి ఆరోపిస్తోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ రిప్లై ఇచ్చింది. అదేంటంటే...
 
'' నా ప్యాలెస్ ముందు పేదలు ఉండకూడదు.. నా ప్యాలెస్ ముందు మీడియా రాకూడదు అంటే కుదరదమ్మా.. ఇప్పుడున్నది నీ లాగా నియంత పాలన కాదు, ప్రజా పాలన.. అది ప్రజల రోడ్డు.. ప్రజాధనంతో వేసిన రోడ్డు.. మీడియా వస్తుంది, ప్రజలు వస్తారు, త్వరలో సిఐడి కూడా వస్తుంది.
 
అయినా 175 మంది ఎమ్మెల్యేల్లో, నువ్వూ ఒకడివి.. ఎందుకు అంత ఎక్కువగా ఊహించుకుంటావ్? ప్రతిపక్ష నేతగా కూడా పనికి రావని ఏపి ప్రజలు తిరస్కరించారు. నిన్ను గెలిపించింది పులివెందుల ప్రజలు, తాడేపల్లిలో ఏమి పని నీకు? పులివెందుల ప్రజలకు సేవ చేయి వెళ్లి.. అక్కడ కూడా ప్యాలెస్ ఉందిగా, వెళ్ళు..''