ఆదివారం, 7 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (18:57 IST)

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

Kiran Abbavaram, Yukthi Tareja
Kiran Abbavaram, Yukthi Tareja
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా  అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
 
ఈ రోజు 'ఓనమ్' పండుగ సందర్భంగా " K-ర్యాంప్"  సినిమా నుంచి విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కేరళ నేపథ్యంగా జరిగే కథను " K-ర్యాంప్" మూవీలో సరికొత్తగా చూపించబోతున్నారు. ఓనమ్ పండుగ సెలబ్రేషన్స్ తో సాగే పాటను కూడా ఈ మూవీలో ప్రత్యేకంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా జరుగుతున్నాయి. ఈ నెల 9న " K-ర్యాంప్" సినిమా నుంచి మ్యాజికల్ లవ్ మెలొడీ సాంగ్ 'కలలే కలలే' విడుదల చేయబోతున్నారు.
నటీనటులు - కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు