1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 11 జులై 2025 (19:05 IST)

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్

Jains nani, Kiran
Jains nani, Kiran
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.
 
తాజాగా ఓ స్పెషల్ వీడియోతో " K-ర్యాంప్"  సినిమా నుంచి 'రిచెస్ట్ చిల్లర్ గయ్' గ్లింప్స్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.  ఈ నెల 14న ఈ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. కొచ్చి పోర్ట్ లొకేషన్ లో కిరణ్ అబ్బవరం, దర్శకుడు జైన్స్ నాని మధ్య సరదా సంభాషణతో రూపొందించిన ఈ అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న "K-ర్యాంప్"  మూవీ దీపావళికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్, జైన్స్ నాని