సంబంధిత వార్తలు
- కన్నబిడ్డ ప్రేమను అడ్డుకున్న తండ్రి.. ప్రియుడుతో కలిసి కొట్టి చంపేసిన తల్లీ కూతుళ్లు
- బూస్ నుండి బూమ్ వరకు: జస్ప్రీత్ బుమ్రాతో బూమర్ తాజా టీవీసీ
- Silver: ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి వెండి ధరలు- లక్ష మార్కును తాకిన కిలో వెండి
- తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్
- దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన బీమా క్లెయిమ్ : రూ.4091 కోట్లు చెల్లించనున్న జీఐసీ
రూ.లక్ష డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఎస్ఈ .. రూ.80 వేలు తీసుకుంటూ చిక్కాడు...
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులపై ఏసీబీ కొరఢా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ శాఖ ఎస్ఈ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. రూ.లక్ష డిమాండ్ చేసిన ఈ ఎస్ఐ తొలుత రూ.20 వేలు తీసుకుని రూ.80 వేల నగదును లంచంగా తీసుకుంటుండగా పట్టుకున్నారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
పామూరు జిల్లా సర్కిల్ పరిధిలోని తెలగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎన్.పి.డి.సి.ఎల్) ఆపరేషన్స్‌లో భాగంగా, సూపరింటెండింగ్ ఇంజనీరుగా పని చేసే జనగాం నరేష్, ఒక ఫిర్యాదుదారుని నుంచి లంచం డిమాండ్ చేశారు. కురవి మరియు మరిపెడ సబ్ సడివిజన్లకు సంబంధించిన ప్రస్తుతం అమల్లో ఉన్న అంగీకార పత్రాల ఒప్పందాలను యధాతథంగా కొనసాగించేందుకు అధికారికంగా సహకరించేందుకుగాను ఆయన మొత్తం రూ.లక్ష డిమాండ్ చేశారు.
ఇందులోభాగంగా, ఇప్పటికే రూ.20 వేలు ముడుపులు స్వీకరించిన సురేష్ మిగిలిన రూ.80 వేలు బుధవారం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నరేష్‌ను లంచం డబ్బులతో సహా అదుపులోకి తీసుకుంది. ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
