సంబంధిత వార్తలు
- జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ - పులివెందులకు ఉప ఎన్నిక!
- RRR : అసెంబ్లీ సమావేశాలకు హాజరుకండి.. జగన్ను గౌరవంగా ఆహ్వానించిన ఆర్ఆర్ఆర్
- Jagan: సెప్టెంబర్ 18 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం- జగన్ హాజరవుతారా?
- Kavitha and Sharmila: ఏపీలో షర్మిల.. తెలంగాణలో కవిత..? ఏం జరుగబోతోంది?
- Jagan: చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన జగన్.. రైతులు క్యూల్లో నిలబడాల్సి వుంది
జగన్‌పై ఫైర్ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
Varma
పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యూరియా కొరత పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని వర్మ తెలిపారు. కాకినాడ జిల్లాకు మొత్తం 23,359 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటికే 19,385 మెట్రిక్ టన్నులను సొసైటీల ద్వారా రైతులకు పంపిణీ చేశామని ఆయన గణాంకాలతో సహా వివరించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరకు యూరియాను అమ్ముకొని రైతులను దోచుకున్నారని వర్మ ఆరోపించారు. ఇప్పుడు తమ కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎమ్మార్పీ రేటుకే యూరియా అందుతుంటే, ఆ వాస్తవం జగన్‌కు కనిపించకపోవడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. 2019 నుంచి 2024 వరకు రైతులకు పూర్తిస్థాయిలో యూరియాను అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.
