Chai Biscut team with Rana Daggubati
తెలుగు డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్‌కి పదేళ్లుగా కొత్త దారులు చూపిస్తున్నచాయ్ బిస్కెట్, దేశంలోని తొలి రీజినల్ షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం చాయ్ షాట్స్ ను గ్రాండ్ గా లాంచ్ చేసింది.స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “థర్డ్ స్క్రీన్ ప్లాట్‌ఫార్మ్” లో 2 నిమిషాలకు లోపు ఉండే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉంటాయి.
'చాయ్ షాట్స్' యాప్ లాంచ్ ఈవెంట్ లో హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి మాట్లాడుతూ.. అందరికీ హాయ్. ఓటిటిలు లేనప్పుడు, అమితాబచ్చన్ గారు తప్పితే మిగతా స్టార్స్ ఎవరూ కూడా టీవీలోకి రానప్పుడు, తెలుగు వాళ్లకి థియేటర్ తర్వాత జెమినీ టీవీ ఒక్కటే ఉన్నప్పుడు.. ఆ సమయంలో శరత్ అనురాగ్ ని నేను కలిశాను. వీళ్లకున్న కల్చర్, ఆటిట్యూడ్, క్రియేటివ్ పర్స్పెక్టివ్ అద్భుతం. మేము కలిసి టీవీ షోలు, స్టేజి ఈవెంట్స్, మూవీ మార్కెటింగ్ ఎలా ఎన్నో చేశాం. నా ప్రతి జర్నీలో వాళ్ళు ఉన్నారు.
చాయ్ షాట్స్.. కంటెంట్ క్రియేటర్స్ చేతిలో ఒక ఎక్స్ట్రీమ్ పవర్. ప్రస్తుతం 200 మంది క్రియేటర్స్ కి ఇది ఎంపార్ చేసింది. ఈరోజుల్లో ఆడియన్స్ ప్రతి దాన్ని బింజ్ వాచ్ చేస్తున్నారు. శరత్ అనురాగ్ ఆలోచనలు ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా ఉంటాయి. వాళ్ళు తెలుగు యంగ్ ఆడియన్స్ ని అద్భుతంగా అర్థం చేసుకున్నారు. వాళ్ల జర్నీలో నేను ఒక చిన్న పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ జర్నీలో వాళ్ళకి ఏది కావాలన్నా నేను చేస్తాను. ఈ ఐడియా ని సపోర్ట్ చేస్తూ ఇందులో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇందులో ఉన్న కంటెంట్ సినిమాలాగే పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందులో ఉన్న స్టార్స్, క్రియేటర్స్ అందరు కూడా మూవీ స్టార్స్ లాగే అవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నేను అన్నీ షోస్ చూస్తాను. ఇంత అద్భుతమైన ఈవెంట్ చేసిన శరత్ అనురాగ్ కి కంగ్రాజులేషన్స్.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ.. మా వాళ్ళు ఇంత పెద్ద వాళ్ళు అయ్యారని చాలా ఆనందంగా ఉంది. ఈ కంటెంట్ చూస్తుంటే కచ్చితంగా ఇది చాలా గొప్ప స్థాయికి వెళ్తుందని నమ్మకం వచ్చింది. వేల కోట్లకి ఎదిగే పొటెన్షియల్ ఉందని నమ్ముతున్నాను. మైత్రి మూవీ మేకర్స్ లో మేము డిఫరెంట్ కంటెంట్ ని చేసాం. కానీ ఇప్పుడు ట్రెండు రోజురోజుకీ మారిపోతుంది. చాయ్ షాట్స్ ఆలోచన చూస్తుంటే మేము కూడా వాళ్లతో కొలాబరేట్ అవ్వాలని ఉంది. ఇందులో క్రియేటర్స్ యాక్టర్స్ అందరు కూడా బిగ్ స్క్రీన్ మీదకి రావాలని కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది. మీరు కష్టపడి పని చేయండి. మీ బిగ్ స్క్రీన్ డ్రీమ్ కూడా నెరవేరుతుంది. మైత్రి మూవీ మేకర్స్ లో అనురాగ్ శరత్ హార్డ్ వర్క్ కూడా ఉం.ది చాలా క్రియేటివ్ ఐదియాలు ఇచ్చారు. పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ చాయ్ బిస్కెట్స్ ఇచ్చిన ఐడియాలే ఇంప్లిమెంట్ అయ్యాయి. బీహార్ లో చేసిన ఈవెంట్ ఐడియా వాళ్ల నుంచి వచ్చింది. వాళ్లు చాలా క్రియేటివ్ పీపుల్. కచ్చితంగా చాలా గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను.
చాయ్ బిస్కెట్ శరత్ మాట్లాడుతూ.. హాయ్ ఎవ్రీబడీ. టెన్ ఇయర్స్.. 2 బిలియన్ వ్యూస్, అద్భుతమైన స్టోరీస్, టాలెంట్.. ఇదొక గొప్ప ప్రయాణం. మా లైఫ్ లో నెక్స్ట్ చాప్టర్ మొదలు పెడుతున్నాం. షార్ట్ సిరీస్ ఓటిటి ప్లాట్ఫామ్ ని లాంచ్ చస్తున్నాం. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఏమిటి అనే ఫండమెంటల్ క్వశ్చన్ మమ్మల్ని మేము అడిగాం. పూర్వకాలం మనం మనమందరం ఎంటర్టైన్మెంట్ కోసం రాత్రుళ్ళు చలిమంట దగ్గర కూర్చుని కథలు చెప్పుకునే వాళ్ళం. ఎమోషన్స్ కనెక్షన్స్ మనకి కథలు ద్వారానే వచ్చాయి. అది మన డిఎన్ఏ లోనే ఉంది. ప్రస్తుత రోజుల్లో ఆ ఎంటర్టైన్మెంట్ ని మూడు స్క్రీన్స్ రిప్లేస్ చేశాయి. బిగ్ స్క్రీన్, టీవీ, మొబైల్ స్క్రీన్. థియేటర్ అంటే మనందరికీ ఒక పండగ.
టీవీ ఇంట్లో రిలాక్స్ అవ్వడానికి ఎంటర్టైన్ అవ్వడానికి చూస్తాం. మూడో డివైస్ మొబైల్. ఈరోజు మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. రోజులో దాదాపుగా ఆరు గంటలు మనం మొబైల్ ని యూస్ చేస్తున్నామని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇంతసేపు మనం యూస్ చేస్తున్న ఫోన్స్ కి కంటెంట్ ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే.. అక్కడ మాకు చాలా గ్యాప్ కనిపించింది. అప్పుడు మేము మిగతా దేశాల్లో ఏం చేస్తున్నారని గమనించాం. అమెరికా చైనా వాళ్లు మొబైల్ ఫోన్ వర్టికల్ ఫార్మెట్ కంటెంట్ వుండాలని ఫిగర్ అవుట్ చేశారు. ఇది చైనాలో ఏడు బిలియన్ డాలర్ల మార్కెట్, యూఎస్ లో రెండు, అలాగే కొరియా జపాన్లో కూడా బిలియన్ డాలర్ మార్కెట్ ఉంది. ప్రపంచమంతా మొబైల్ కోసం చేసిన వర్టికల్ షాట్స్ కంటెంట్స్ ని ఎంకరేజ్ చేస్తుంది. కానీ భారతదేశం కింగ్ ఆఫ్ స్టోరీ టెల్లర్స్. మనకి ప్రపంచంలోనే బెస్ట్ స్టోరీస్ ఉన్నాయి. కాకపోతే వర్టికల్ కంటెంట్ లో మనం ఎక్కడో ఇంకా వెనకాల ఉండిపోయాం.
చైనా కొరియన్ కంటెంట్ డబ్బింగ్ లో చూస్తున్నాం. అందుకే నేను అనురాగ్, కృష్ణ సాయి, చాయ్ బిస్కెట్ టీ, కొంతమంది ఫ్రెండ్స్ కలిసి షార్ట్ సిరీస్ ఓ టి టి ప్లాట్ఫామ్ లాంచ్ చేస్తున్నాం.ఇండియాలో దీంతో ఒక కొత్త ఎరా మొదలు కాబోతుంది.అది హైదరాబాద్ నుంచే స్టార్ట్ కావడం ఆనందంగా వుంది. ఇది చాలా ఫాస్ట్ గా షార్ప్ గా ఎంగేజింగ్ గా ఉండబోతుంది అందర్నీ చాలా క్యూట్ ఎంటర్టైన్ చేస్తుంది. ఫిక్షన్ నా చేస్తున్నాం ప్రస్తుతం తెలుగులో స్టీమ్ చేస్తున్నాం త్వరలోనే అన్ని భాషల్లో లాంచ్ చేస్తాం. చాయ్ షాట్స్ ని మేము రెండు నెలల క్రితమే లాంచ్ చేశాం. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిజల్ట్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. రెండేళ్లలోనే మూడున్నర లక్షల డౌన్లోడ్ జరిగాయి. ఆడియన్స్ ప్రతి సిరిస్ బింజ్ వాచ్ చేస్తున్నారు. ఈ ఎంకరేజ్మెంట్ తోనే చాయ్ షాట్స్ ఓటీటీ ని లాంచ్ చేస్తున్నాం.
చాయ్ బిస్కెట్ అనురాగ్ మాట్లాడుతూ.. మా కెరీర్ బిగినింగ్ నుంచి కొత్త కంటెంట్ క్రియేటర్స్ తో వర్క్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర చాలా మంచి ఎనర్జీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఉండే మంచి కంటెంట్ క్రియేటర్స్ తో కంటెంట్ చేయాలని భావించాం. మీరు చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పటివరకు మేము చేసిన 75 షోస్ లో కొత్త టాలెంట్ ని చూస్తారు. కొత్త టాలెంట్ ని తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఈ యాప్ ఓపెన్ చేస్తే ఇండియా మొత్తం చూసేలా ఉండాలి. అందుకే మేము మూలల్లోకి వెళ్లి ఒక గొప్ప కంటెంట్ తీసుకురావాలని ప్రయత్నించాం. మేము ఇందులో ఇంకో మంచి ఫీచర్ తీసుకొచ్చాం. ఒక షో చూసినప్పుడు ఇందులో టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరి పేర్లు ఉంటాయి.పర్ఫార్మెన్స్ నచ్చితే ఆ పేరు దగ్గరికి వెళ్లి క్లాప్ కూడా ఇవ్వచ్చు. మీకు నచ్చితే వాళ్లకి కొంత మనీ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మేము కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ ఇది.