మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (11:01 IST)

సర్పవరం ఎస్‌ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య: రివాల్వర్‌తో కాల్చుకుని..?

సర్పవరం ఎస్‌ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. 
 
కాకినాడ జీజీహెచ్ మార్చురీలో ఎస్ఐ గోపాలకృష్ణ మృతదేహన్ని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. 
 
ఈ ఘటన ఆత్మహత్యనా లేక మిస్ ఫైరా అనేది తేలాల్సి ఉంది. కాగా, ప్రభుత్వం, జిల్లా ఎస్పీ వేధింపుల వల్లే గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
 
గోపాలకృష్ణకు ట్రైనింగ్ పూర్తయ్యాక కొన్నాళ్లు ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహించాడు. ఆ తర్వాత స్టేషన్ బాధ్యతలు ఇవ్వకుండా సర్పవరం సర్కిల్లో పోస్టింగ్ వేశారు. 
 
అధికారుల తీరుపై కొన్నాళ్లుగా ఎస్‌ఐ గోపాలకృష్ణ మనస్తాపంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.