గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 3 డిశెంబరు 2021 (11:41 IST)

కృష్ణా జిల్లాలో ఎస్సైల‌కు స్థాన చ‌ల‌నం!

కృష్ణా జిల్లా ఎస్పీ ప‌లువురు పోలీస్ అధికారుల‌కు స్థాన చ‌ల‌నం క‌లిగించారు. జిల్లాలోని పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్ పి సిద్దార్థ్ కౌశల్ ఉత్తర్వులు జారీ చేసారు.

 
ఎస్సై జి. రామకృష్ణను నందిగామ నుండి చందర్లపాడు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఎస్సై వి. ఏసోబును చందర్లపాడు నుండి గుడివాడ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. నందిగామ ఎస్సై డి.ఎస్. తాతాచార్యులును నందిగామ నుండి పెదపారుపూడి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.


ఎస్సై పి సురేష్ ను  గుడివాడ నుండి నందిగామ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఎస్సై పండు దొరను పామర్రు నుండి నందిగామ పోలీస్ స్టేషన్ కు నియ‌మించారు. ఎస్పై అవినాష్ ను గుడివాడ నుండి పామర్రు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ, కృష్ణా ఎస్పీ ఉత్త‌ర్వులు జారీ చేశారు.