మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (11:57 IST)

ఏసీపీ వేధింపులు తాళలేక ఎస్ఐ ఆత్మహత్యాయత్నం ... ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఏసీపీ(అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) వేధింపులు భరించలేక ఓ ఎస్ఐ బలవన్మరణ యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడ నగరంలో కలకలం రేపింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న విజయ్ కుమార్.. మంగళవారం తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. 
 
దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఎస్ఐకి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు ప్రకటించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
 
అయితే, బలవన్మరణానికి పాల్పడటానికి గల కారణాలను విజయకుమార్ వివరించారు. దిశ ఏసీపీ నాయుడు తనను వేధింపులకు గురిచేశాడని, అందువల్లే తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు విజయవాడ నగర పోలీస్ కమిషనరుకు లేఖ రాశారు. 
 
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పలు లేఖ ద్వారా పలు వివరాలను తెలిపారు. నిజమైన కేసును తప్పుడు కేసుగా తనతో చేయిస్తున్నారని.. తాను ప్రశ్నించినందుకు తనపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 
 
కష్టపడి పనిచేస్తున్నా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఏసీపీ పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్యాయత్నానికి యత్నించినట్లు ఎస్ఐ లేఖలో తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాల కోసం సీపీ శ్రీనివాసులు దర్యాప్తునకు ఆదేశించారు.