శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 3 నవంబరు 2021 (11:40 IST)

స్థానిక ఎన్నిక‌ల‌కు నేటి నుండే నామినేషన్లు! మొద‌లైన రాజ‌కీయ ర‌చ్చ‌

ఏపీలో స్థానిక ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ జారీ కావ‌డంతో అభ్యర్థుల ఎంపికలో పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి.  ఈ సారి స్థానిక ఎన్నిక‌ల్లో ఎలాగైనా వైసీపీని ఢీకొట్టాల‌ని బలమైన అభ్యర్థులను టీడీపీ సిద్ధం చేస్తోంది.  వైసీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ త‌యారైపోయింది. ఇక త‌మ‌కు బలమున్న చోట సత్తా చాటేందుకు జనసేన- బిజెపి ప్ర‌య‌త్నిస్తున్నాయి. 
 
 
విజ‌య‌వాడ స‌మీపంలోని కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల నగారా మోగడం తో నేటినుండి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు తలమునకలై బిజీ బిజీగా ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు సంసిద్ధంగా ఉంది. సామాజికంగా ఆర్థికంగా బలమైన అభ్యర్థిలను దింపి ఎన్నికలకు సిద్ధంగా ఉంది. దీంతో వైఎస్సార్ సీపీ ఇరకాటంలో పడినట్లైంది.
 

ఇటు వైసిపి కూడా అభ్యర్థుల లిస్ట్ 1:2 గా అధినేత వద్ద ఫైనల్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అధినేత నియమించిన కమిటీ సభ్యులు దాదాపుగా లిస్టు ఆయనకు అందించారు. అయితే  ఇంకా  ఆయన ఆ లిస్టును ఫైనల్ చేయాల్సి ఉంది. అటు జనసేన- బి.జె.పి కూటమి కూడా తమకు బలమున్న చోట సత్తా చాటేందుకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి రంగంలోకి దింపుతున్నాయి. సీటు రానివాళ్లలను బుజ్జగిస్తూ పార్టీలో ఎలాంటి  వ్యతిరేకత లేకుండా ఉండేందుకు అధినేతలు కసరత్తు చేస్తున్నారు.