సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (16:40 IST)

విజయవాడలో అగ్రస్థానంలో నిలిచిన ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థి ఈశ్వర్‌ చౌదరి, ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 221

విజయవాడలోని ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్ధి ఈశ్వర్‌ చౌదరి, ఇనిస్టిట్యూట్‌కు గర్వకారణంగా నిలుస్తూ అత్యంత ప్రతిష్టాత్మకమైన  జాతీయ ప్రవేశ పరీక్ష (నీట్‌) యుజీ 2021లో ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 221 సాధించి తన తల్లిదండ్రులకు మరియు ఇనిస్టిట్యూట్‌ వద్ద మొత్తం సిబ్బందికి గర్వకారణంగా నిలిచాడు. ప్రతిష్టాత్మకమైన వైద్య ప్రవేశ పరీక్షలో 720కు గాను 696 మార్కులు అతను సాధించాడు. ఈ ఇనిస్టిట్యూట్‌ నుంచి మంచి ర్యాంకులు సాధించిన ఇతర విద్యార్థులలో అంబికా గోవింద్‌; వి కిరణ్‌ సాయి; స్టీవ్‌ జోషువా మరియు క్షితిజా ప్రియ ఉన్నారు. ఎం బైపీసీ విద్యార్ధిని అంబికా గోవింద్ నీట్‌లో 667 మార్కులతో పాటుగా ఇంజినీరింగ్ అడ్వాన్స్ పరీక్షలలో సైతం 5680 ర్యాంక్ సాధించినందుకు యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.
 
ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నేడు ప్రకటించింది.
ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా గుర్తింపు పొందిన నీట్‌లో ర్యాంకు సాధించేందుకు ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌లో రెండు సంవత్సరాల  క్లాస్‌రూమ్ మరియు లైవ్ ప్రోగ్రామ్ లో ఈశ్వర్ చేరాడు. కాన్సెప్ట్స్‌ అర్థం చేసుకోవడం, అభ్యాస షెడ్యూల్స్‌కు ఖచ్చితంగా కట్టుబడి ఉండటం కారణంగానే టాప్‌ పర్సంటైల్‌ సాధించిన వారి సరసన తాను నిలువగలిగానన్నాడు. ‘‘ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ నాకు ఈ రెండు అంశాలలోనూ ఎంతగానో తోడ్పడింది. వారి కోచింగ్‌, కంటెంట్‌ కారణంగానే అతి తక్కువ సమయంలోనే విభిన్నమైన బోధనాంశాలను మెరుగ్గా ఆకలింపు చేసుకోవడం సాధ్యమైంద’’ని అతను వెల్లడించాడు.
 
ఈశ్వర్‌ను అభినందించిన శ్రీ ఆకాష్‌ చౌదరి, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) మాట్లాడుతూ, ‘‘ అసాధారణ ప్రతిభ కనబరిచిన ఈశ్వర్‌ను మేము అభినందిస్తున్నాము. దేశ వ్యాప్తంగా నీట్‌ 2021 కోసం 16 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అతను సాధించిన విజయం, అతని కష్టం మరియు అంకిత భావంతో పాటుగా అతని తల్లిదండ్రుల మద్దతు గురించి పుంఖానుపుంఖాలుగా వెల్లడిస్తుంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలను అతను సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ, మహమ్మారి కాలంలో ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ ఓ అడుగు ముందుకువేసి విద్యార్థులు నీట్‌‌లో మంచి పర్సంటైల్‌ స్కోర్స్‌ సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ‘‘మా విద్యార్థులకు డిజిటల్‌గా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకున్నాం. స్టడీ మెటీరియల్స్‌, క్వశ్చన్‌ బ్యాంక్స్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాము. వర్ట్యువల్‌గా  మోటివేషనల్‌ సదస్సులు మరియు పరీక్షలకు సంసిద్ధం కావడంపై సెమినార్లు, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యంపై సదస్సులు నిర్వహించాం. మా కష్టం ఫలించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. మా విద్యార్థులు సాధించిన స్కోర్‌ షీట్స్‌లో అది ప్రతిబింబిస్తుంది. మా విద్యార్థులలో చాలామంది భారతదేశంలో అగ్రశ్రేణి మెడికల్‌ కాలేజీలలో ప్రవేశాలు పొందగలరు’’అని అన్నారు.
 
అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ (ఎంబీబీఎస్‌), డెంటల్‌ (బీడీఎస్‌) మరియు ఆయుష్‌ (బీఏఎంఎస్‌, బీయుఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ మొదలైనవి) కోర్సులలో భారతదేశ  వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇనిస్టిట్యూట్‌లలో ప్రవేశం కోసం  నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రతి సంవత్సరం నీట్‌ ను అర్హత పరీక్షగా నిర్వహిస్తుంది. 
 
2.
నాదెండ్ల మనోహర్ తో జనసేనానికి గ్యాప్ పెరుగుతోందా..?
 
జనసేనపార్టీలో పవన్ కళ్యాణ్‌ తరువాత రెండవ స్థాయి వ్యక్తి నాదెండ్ల మనోహర్. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండడమే కాకుండా శాసనసభ స్పీకర్ గా వ్యవహరించారు నాదెండ్ల మనోహర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 
 
అయితే వైసిపిలో చేరకుండా పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో మనోహర్ జనసేనలో ఉన్నారు. ఆ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా పదవి గురించి పట్టించుకోని నాదెండ్ల మనోహర్ వైసిపి, టిడిపిపై తనదైన శైలిలో విమర్సలు చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏ సమావేశానికి హాజరైనా కూడా ఆ సమావేశానికి వస్తుంటారు.
 
ఆయన పక్కనే ఉంటారు. అయితే నాదెండ్ల మనోహర్ కు జనసేనానికి మధ్య ఈ మధ్య గ్యాప్ పెరుగుతోందన్న ప్రచారం ఆ పార్టీలోనే సాగుతోందట. అందుకు కారణం తనకు తెలియకుండా పార్టీలో కొన్ని నిర్ణయాలు మనోహర్ తీసుకోవడం..బిజెపిని విమర్సించడం వంటివి చేయడం పవన్ కళ్యాణ్ కు కోపం తెప్పించాయట 
 
బిజెపితో సన్నిహితంగా కలిసి ఉన్నప్పుడు ఆ పార్టీ గురించి మాట్లాడడం భావ్యం కాదని..పొత్తుల గురించి..పార్టీని వదిలేయడం లాంటి విషయాలు ప్రస్తావించడం చేయకూడదన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనట. అయితే దీన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా నాదెండ్ల మనోహర్ కొన్ని విషయాలు బయట మాట్లాడడం పవన్ కు బాగా కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. 
 
దీంతో విశాఖ ప్లాంట్ పై జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ చాలాసేపు పవన్ కళ్యాణ్ తో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం మాట్లాడలేదట. వినీవిన్నట్లు సైలెంట్ గా ఆ సభలో ఉండిపోయారట పవన్ కళ్యాణ్. నాదెండ్ల మనోహర్ తన తీరు మార్చుకోకపోతే పార్టీ నుంచి కూడా బయటకు పంపించాలన్న నిర్ణయానికి జనసేనాని వచ్చినట్లు తెలుస్తోంది.
 
3.
సూర్యపై కోలీవుడ్ ఆగ్రహం..ఇక బ్యాన్ ఖాయమా..?
 
విలక్షణ నటుడు సూర్య. ఎలాంటి పాత్రఅయినా అవలీలగా చేయగలడు. తనదైన శైలిలో నటిస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నాడు సూర్య. కరోనా కారణంగా సూర్య చాలా తక్కువ సినిమాల్లోనే నటించగలిగాడు. ఆకాశమే నీ హద్దురా అంటూ సూర్య నటించిన చిత్రం కాస్త ఓటిటీలో రిలీజై మంచి టాక్ ను తెచ్చుకుంది.
 
అయితే తాజాగా విడులైన జై భీం సినిమా కూడా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి దర్సకుడు జ్ఙాన్ వేల్. అయితే సినిమాను థియేటర్లలో విడుదల చేసుకుంటనే లాభం కలుగుతుందన్నది డిస్ట్రిబ్యూటర్ల వాదన. ఎప్పటి నుంచో ఈ విషయాన్ని సూర్య దృష్టికి తీసుకెళ్ళారు నిర్మాతలు.
 
అయితే ఆకాశమే హద్దురా సినిమా తరువాత ఒకే చెప్పిన సూర్య మళ్ళీ జైభీం సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయమని చెప్పాడట. ఇది కాస్త నిర్మాతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోందట. ఎంత చెప్పినా సూర్య వినిపించుకోకపోవడంతో నిర్మాతలు సూర్య సినిమాలు బ్యాన్ చేయాలని నిర్ణయించేసుకున్నారట. అందరు నిర్మాతలు కలిసి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
గతంలో టక్ జగదీష్ సినిమాలో నిర్మాతలతో గొడవకు దిగి ఓటీటీలో రిలీజ్ చేసిన నానికి ఏ విధంగా అయితే తెలుగు సినీపరిశ్రమలో జరిగిందో తమిళంలోను సూర్యకు అలా జరుగుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 
 
4.
అర్థరాత్రి..స్నేహితుడికి ఫోన్ చేసింది..వచ్చాడు..కారులో తీసుకెళ్ళాడు..కానీ మధ్యలో..?
 
తనతో పాటు చదువుకున్న వ్యక్తి. మంచివాడు. స్నేహితుడు కదా అని నమ్మింది. తల్లిదండ్రులతో పాటు సమానంగా స్నేహితుడికి గౌరవమిచ్చేది. అదే ఆమె పాలిట శాపంగా మారుతుందని ఊహించలేదు అభాగ్యురాలు. నమ్మి స్నేహితుడికి ఫోన్ చేసి హాస్టల్ కు తీసుకెళ్ళమన్నందుకు అతని వక్రబుద్ధిని చూపించాడు. పలుమార్లు అత్యాచారం చేసి నడిరోడ్డుపైనే వదిలివెళ్ళిపోయాడు. 
 
పంజాబ్ లోని మోహాలిజిల్లాలోని జిరాక్ పూర్ లో ఉంటోంది 22యేళ్ళ యువతి. హాస్టల్ లో ఉంటూ విద్యనభ్యసిస్తోంది. తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి రెండురోజుల క్రితం రాత్రి వేళలో జిరాక్ పూర్ కు 15కిలోమీటర్ల దూరంకు చేరుకుంది. హాస్టల్ కు వెళ్ళాల్సి ఉండగా స్నేహితుడు కుష్వీందర్ భటిండాకు ఫోన్ చేసింది. 
 
రాత్రి వేళలో వచ్చిన అతను కారులో యువతిని ఎక్కించుకున్నాడు. మామూలుగా వెళ్ళే రూట్ లో కాకుండా వేరొక రూట్ లోకి కారును మళ్ళించాడు. స్నేహితుడని నమ్మినందుకు భటిండా ఆ యువతిని మోసం చేశాడు. దట్టమైన అటవీ ప్రాంతంలో కారును నిలిపాడు. తన వద్ద తెచ్చుకున్న కత్తిని చూపించి యువతిని బెదిరించాడు.
 
తనకు లొంగిపోవాలని లేకుంటే చంపేస్తానన్నాడు. అయినా ఆయువతి ప్రతిఘటించింది. దీంతో ఆమెను అత్యంత క్రూరంగా మర్మాంగాలపై దాడి చేసి పలుమార్లు అత్యాచారం జరిపాడు. ఆ చిమ్మచీకటిలో ఆమెను వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎలాగోలా అక్కడి నుంచి వచ్చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.