Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్
నటుడు, చెఫ్ అయిన మాదంపట్టి రంగరాజ్ రెండో పెళ్లి వ్యవహారం నెట్టింట వైరల్ అవుతూనే వుంది. ఈయన యవ్వారం ట్రెండింగ్‌లో వుంది. సినీ సెలెబ్రిటీ కంటే మాదంపట్టి రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు కోలీవుడ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. తాజాగా మాదంపట్టి తనకు ద్రోహం చేశాడని.. ఆతని రెండో భార్య జాయ్ క్రిస్టిల్డా ఆరోపించారు. మాదంపట్టిని 2023లో జాయ్ వివాహం చేసుకున్నారు.
వీరి వివాహం సింపుల్‌గా ఓ ఆలయంలో జరిగింది. దీంతో వీరిద్దరూ భార్యాభర్తలుగా రెండేళ్ల పాటు జీవనం సాగించారు. ప్రస్తుతం జాయ్ ఆరు నెలల గర్భవతి. అయితే పెళ్లి విషయాన్ని జూలై వెల్లడించిన జాయ్.. తాను గర్భవతిగా వున్నాననే విషయాన్ని కూడా డిక్లేర్ చేసింది.
దీంతో మాదంపట్టిపై అభిమానులకు వున్న పరువు గంగలో కలిసిపోయింది. వీరిద్దరి మధ్య విబేధాలున్నట్లు.. మాదంపట్టి తనను పెళ్లి చేసుకుని గర్భవతిని చేసి పారిపోయాడని జాయ్ ఆరోపించారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మూడుసార్లు తనకు అబార్షన్ చేయించాడని.. నాలుగోసారి కూడా చేయిస్తే తనకు ఆరోగ్య పరంగా ఇబ్బంది ఏర్పడుతుందని వైద్యులు తెలిపారని జాయ్ వెల్లడించారు.
దీంతో మాదంపట్టి విచారణకు కూడా హాజరయ్యారు. ఈ విచారణ సందర్భంగా మాదంపట్టి జాయ్‌తో సంబంధాలు నిజమేనని, ఆమె కడుపులో వున్న బిడ్డకు తాను తండ్రినని ఒప్పుకున్నట్లు జాయ్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టును మాదం పట్టి ఖండించారు.
ఇంకా డీఎన్ఏ టెస్టుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జాయ్ క్రిస్టిల్డా ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టు వైరల్ అవుతోంది. ఈ పోస్టులో మాదంపట్టి డీఎన్ఏ టెస్టుకు సిద్ధమని 15 రోజులైంది.
ఎక్కడికో పారిపోయాడు. మాదంపట్టికి ధైర్యం వుంటే డీఎన్ఏ టెస్టుకు రావాలని సవాలు విసిరారు. ఈ సందర్భంగా మాదంపట్టితో తీసుకున్న ఫోటోను కూడా జాయ్ షేర్ చేసింది.