Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్
Manchu Manoj eating pani poori, David Reddy, Hanuman Reddy
ఈ దీపావళికి మంచు మనోజ్ చాలా బాగా జరుపుకున్నారు. తన జూనియర్ నా చిన్న హీరోతో గోల్గప్పా తో పానీ పూరీ ఆనందం గా తిన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ప్రేక్షకులకు మీకు ప్రేమతో నిండిన దీపావళి శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. అదేవిధంగా చారిత్రాత్మక కథతో డేవిడ్ రెడ్డి చిత్రాన్ని హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ఇక డేవిడ్ రెడ్డి విషయానికి వస్తే.. ఇంతకు ముందు రాని కథతో రూపొందుతోంది. రాజమౌళి 1920నాటి స్వాత్రంత్ర పోరాట యోధులను కలిపి ఆర్.ఆర్.ఆర్. సినిమా తీశాడు. అయితే.. 1920 కు ముందు జరిగిన కథతో మనోజ్ రాబోతున్నాడు. డేవిడ్ రెడ్డి గురించి మంచు మనోజ్ మాట్లాడుతూ, నేను మిరాయ్ ప్రమోషన్ లో చెప్పినట్లు డేవిడ్ రెడ్డి సినిమా చేస్తున్నారు. ఇది ఇంతవరకు ఎవరూ టచ్ చేయని పాయింట్. హనుమాన్ సినిమాకు పనిచేసిన కొత్త దర్శకుడు హనుమాన్ రెడ్డి పనిచేస్తున్నాడు. తను చెప్పిన కథ చాలా ఎగ్జైట్ మెంట్ కలిగించింది.
అది ఎలావుంటుందంటే... బ్రిటీష్ కాలంనాటి కథ, 1897 టు 1920 వరకు జరిగిన కథ. ఆ పిరీడ్ లో జరిగినంత యాక్షన్ ఎక్కడా జరగలేదు. ఒకవైపు బ్రిటీష్ వారికి మరోవైపు గాంధీకి ఛాలెంజ్ గా మారిన అత్యంత విప్లవాత్మకమైన వ్యక్తి కథ. గాంధీకి ట్రబుల్, బ్రిటీష్ కూ ట్రబుల్ అయిన పోరాట యోధుని కథ. ఇద్దరికీ ఎలా లింక్ అనేది కల్పిత కథగా దర్శకుడు హనుమాన్ రెడ్డి చెప్పిన విధానం బాగా నచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్త నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు.