మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
తను ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు సమాధానంగా సన్యాసం తీసుకుంటానని చెప్పిన మాటను మీడియాలో కొందరు సీరియస్ టాపిక్కుగా మార్చేసారనంటూ రేణూ దేశాయ్ పేర్కొన్నారు. తను ఓ వీడియో ద్వారా ఈ విషయంపై ఆశ్చర్యాన్ని ఆవేదనను వ్యక్తం చేసారు. ఆమె మాట్లాడుతూ... నేను మొన్న దీపావళి నాడు ఓ ఇంటర్య్వూలో అడిగిన ప్రశ్నకు సన్యాసం స్వీకరిస్తా అన్నా. ఐతే ఇప్పుడే కాదు. నాకు పిల్లలు వున్నారు. వారి బాధ్యత నాపై వుంది. ఇంకా వారికి నేను చేయాల్సింది చాలా వుంది. సన్యాసం స్వీకరిస్తానని ఎలా చెప్పావని నన్ను కొందరు తిట్టారు. కాబట్టి దణ్ణం పెడుతున్నా. ఈ టాపిక్ కంటే ఇంకా చాలా పెద్ద విషయాలు వున్నాయి. వాటి గురించి మాట్లాడండి అంటూ పోస్ట్ చేసింది రేణూ దేశాయ్.
రేణూ దేశాయ్ ప్రస్తుతం తన పిల్లలు అకీరా, ఆద్యల బాగోగులు చూసుకుంటూ వారికి పూర్తి సమయం కేటాయిస్తున్నారు. అదేసమయంలో అపుడపుడూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విలువలు తెలియజేస్తున్నారు. ఇటీవలే కాల భైరవుడి జయంతిని పురస్కరించుకుని కాశీ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలకు ఓ క్యాప్షన్ జోడించారు. కాల భైరవ జయంతి రోజున మనం రక్షణ కోరుకోకూడదు. మనమే రక్షకుడిగా మారాలి. కాల భైరవుడు మీ వెంట నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ పరమేశ్వరుడు పిలిచినపుడు మీరు అన్నీ వదిలేసి కాశీకి వెళ్తారు. నేను కూడా అంతే.. శివుడు పిలిచినపుడు అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆమె ద్వంద్వార్థంలో పోస్ట్ చేశారు.